మెట్రోలో పెరుగుతునున్న రద్దీ : 6 నిమిషాలకో ట్రైన్

హైదరాబాద్‌: మియాపూర్‌-LB నగర్‌ మెట్రో రూట్ కి  ప్రయాణికుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా స్టేషన్లలో ఎక్కువసేపు ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ రూట్ లో రైల్‌ ఫ్రీక్వెన్సీలో ఎల్‌ అండ్‌ టీ-మెట్రో మార్పులు చేసింది. ఆరు నిమిషాలకు ఒక మెట్రో రైల్‌ నడపనున్నారు. ఫలితంగా ఎదురుచూసే సమయం ప్రయాణికులకు చాలావరకు తగ్గింది. ప్రయాణ వేళల్లో మార్పులు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణం ఇలా.. 
-మియాపూర్‌-LB నగర్‌ రూట్ లో గతంలో ఉదయం 8 నుంచి 12 మధ్య ఆరున్నర నిమిషాలకు ఒక మెట్రో నడవగా.. ఇప్పుడు 6 నిమిషాలకు నడుపుతున్నారు.
-సాయంత్రం 5 నుంచి 9 మధ్య గతంలో 8 నిమిషాలకు ఒకటి నడవగా.. ఇప్పుడు 7 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు.
– నాగోల్‌ -అమీర్‌ పేట రూట్ లో ఇదివరకు మాదిరే రద్దీవేళల్లో ఆరున్నర నిమిషాలకు, మిగతా సమయాల్లో 8 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు.
– అత్యంత రద్దీ సమయాల్లో అవసరం మేరకు అప్పడప్పుడు – నాగోల్‌ -అమీర్‌ పేట రూట్ లో మూడున్నర నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు.
– జనవరి 1 నుంచి నాంపల్లిలో మొదలయ్యే నుమాయిష్‌ రద్దీని తట్టుకునేందుకు మెట్రో రెడీ అవుతోంది. అవసరమైతే ఫ్రీక్వెన్సీలో మరిన్ని మార్పులు చేయనున్నారు. నాంపల్లి స్టేషన్‌ లో ప్రత్యేక టికెట్‌ కౌంటర్లను ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates