మెట్రో రూల్స్ తెలుసుకోండి…లేదంటే జరిమానా తప్పదు

మెట్రో రైళ్లో ప్రయాణించడేమే కాదు….దానికి ముందుగా రూల్స్ పాటించాలి. లేదంటే ఫైన్స్ తప్పవు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో ఎక్కువ మంది నిబంధనలు పాటించడం లేదట. దీంతో భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. ఢిల్లీ మెట్రో‌లో ఫ్లాట్‌ ఫామ్‌ మీద కూర్చోవడం నేరం. అయినా 22,699 మంది ప్రయాణికులు ఫ్లాట్‌ ఫాం మీద కూర్చున్నారు. దీంతో జరిమానా కూడా కట్టారు. ఈ ఏడాది వివిధ ర‌కాలైన నిబంధ‌న‌లు అధిగ‌మించిన‌వారి నుంచి ఢిల్లీ మెట్రో జ‌రిమానాల రూపంలో భారీగానే న‌గ‌దు వ‌సూలు చేసింది. టికెట్లు తీసుకోకుండా స్టేషన్‌ పరిధిలోకి వచ్చినందుకు 2,871మందికి జరిమానా పడింది. పర్మిషన్ లేకుండా మహిళల కోచ్‌లోకి ప్రవేశించినందుకు 2,278 మంది పురుషులపై కేసు నమోదు చేశారు. స్టేషన్‌ పరిసరాల్లో ఉమ్మేసినందుకు 604 మందికి ఫైన్ విధించారు మెట్రో అధికారులు.

Posted in Uncategorized

Latest Updates