మెట్రో రైలు సర్వీసు టైమింగ్స్ మారాయి

హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మార్పులు వచ్చే సోమవారం  నుంచి అమల్లోకి రానున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. వారాంతాల్లో శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో సర్వీసు 6.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే రైలు సర్వీసు 7 గంటలకు ప్రారంభకానున్నట్లు తెలిపారు. రోజులో చివరి సర్వీసు వేళల్లో ఎటువంటి మార్పులు లేవు. యథావిథిగానే ఉన్నాయి. ఈ మార్పులు కూడా తాత్కాలికమేనని అధికారులు చెప్పారు. అమీర్‌పేట-ఎల్బీనగర్, అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గాల్లో ట్రయల్ రన్ కారణంగా ఈ మార్పులు జరిగినట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates