మెట్రో రైల్లో ప్రసవం…పుట్టిన పాపకు 25 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం

parismetro11రైలు సర్వీసులు అప్పుడప్పుడు ఆలస్యమవుతుంటాయి…అది సహజమే. కానీ పారిస్‌లో కూడా ఓ రైలు రావాల్సిన సమయానికి రాకుండా ఆలస్యంగా వచ్చింది. ఇందులో కొత్తేముంది అనుకున్నారా..? ఉంది…నిజంగా ఓ కారణముంది. ఓ మహిళకు రైలులోనే పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా రైలులోని ప్రయాణికులు సిబ్బంది, అత్యవసర విభాగం ఉద్యోగులను అప్రమత్తం చేశారు. ఆర్‌ఈఆర్ ఏ (పారిస్ మెట్రో రైలు)పారిస్‌లోని అవుబెర్ స్టేషన్ వద్ద రైలును నిలిపేశారు. సుమారు 15 మంది ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కలిసి ఆ మహిళకు ప్రసవం సులభంగా అయ్యేలా చేశారు. ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రయాణికులు, అధికారులు, రైల్వే సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ రైలులో పుట్టిన బిడ్డకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది పారిస్ మెట్రో. రైల్వే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా… రైలులో గర్భిణీ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని అన్ని స్టేషన్లలో స్క్రీన్లపై డిస్‌ప్లే చేయించారు రైల్వే అధికారులు.

Posted in Uncategorized

Latest Updates