మెట్రో సర్వీసులు పునరుద్ధరణ

ఇవాళ(అక్టోబర్ 13) ఉదయం మియాపూర్ నుంచి అమీర్ పేట్ వెళ్తున్న మెట్రో రైలులో టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడింది. కరెంట్ సరఫరాలో ఇబ్బంది తలెత్తడంతో బాలానగర్ స్టేషన్ లో మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. అలర్ట్ అయిన మెట్రో సిబ్బంది మరమ్మత్తులు చేపట్టి సర్వీసు పునరుద్ధరించారని మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు రెండు ట్రాక్ ల్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates