మెట్రో, MMTS, RTCలకు ఒకటే కార్డు

హైదరాబాద్ సిటీలో మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త. త్వరలో కామన్ మొబిలిటీ కార్డులు రాబోతున్నాయి.  ఆర్టీసీ, మెట్రోతో పాటు  MMTS ను కూడా అనుసంధానిస్తూ  ఈ కార్డును రూపొందిస్తున్నారు. అందుకోసం వచ్చే నెలాఖరు వరకూ డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం.

కామన్ మొబిలిటీ కార్డులపై మరోసారి కదలిక వచ్చింది.  సిటీ జనం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కామన్ ట్రావెల్ కార్డు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. నగరంలో మెట్రో రైలు సర్వీసులు రెండు ప్రాంతాల నుంచి విజయవంతంగా రన్ అవుతున్నాయి.  రోజుకి రెండు లక్షలమంది జనం మెట్రోలో ప్రయాణిస్తున్నారు.  వచ్చే నెలలో హైటెక్ సిటీ రూట్ లో కూడా మెట్రో రైలు పట్టాలకెక్కితే… ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముంది.  దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళను లింక్ చేస్తూ… పాస్ లు ఇష్యూ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మెట్రో రైల్లో టిక్కెట్లకి, బస్ పాస్ లకు వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది.  దాంతో కామన్ పాస్ ఉంటే… ఖర్చులు తగ్గుతాయనీ… కామన్ మొబిలిటీ కార్డు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, హైదరాబాద్ మెట్రో రైల్ MD ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో బేగంపేట HMRL ఆఫీసులో రివ్యూ మీటింగ్ జరిగింది.  మెట్రో, ఆర్టీసీ, MMTS లకు కలిపి కామన్ మొబిలిటీ కార్డు ప్రవేశపెట్టడంపై ఈ సమావేశంలో చర్చించారు.  SBI, హిటాచీ కన్సార్టియంతో కామన్ మొబిలిటీ కార్డు ను ప్రవేశపెట్టడంపై L అండ్ T మెట్రో CEO అనిల్ శైనీ వివరించారు.  ఈ కార్డుల జారీ కోసం SBI తో సంప్రదింపులు జరపాలని RTC ఈడీకి సూచించారు ప్రిన్సిపల్ సెక్రటరీ.

వచ్చే నెలాఖరు కల్లా కనీసం రెండు మెట్రో స్టేషన్లు, వంద ఆర్టీసీ బస్సులు, 50 ఆటోల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కామన్ మొబిలిటీ కార్డు చెల్లుబాటు అయ్యేలా చూడాలని ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆదేశించారు.  మెట్రో రైల్ ఎండీని ఈ ప్రాజెక్ట్ పురోగతి గురించి మానిటరింగ్ చేయాలని కోరారు.  ఈ సమావేశంలో ఆర్టీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆటో డ్రైవర్ల యూనియన్ కన్వీనర్ HMRL అధికారులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates