మెడపై కత్తి పెట్టి : మాజీ ప్రియుడిపై ప్రియురాలి అత్యాచారం

MAGIమాజీ ప్రియుడి మెడపై కత్తి పెట్టి మరీ అతడిని రేప్ చేసింది ఓ ప్రియురాలు. మంచానికి కట్టేసి ప్రియుడిపై రేప్ కు పాల్పడింది ఆ ప్రియురాలు. అమెరికాలోని మోంటానాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
అమెరికాలోని గ్రేట్ ఫాల్స్ కు చెందిన భాధితుడు, నిందుతురాలు సమంత రే మియర్స్‌(19) ఇద్దరూ కొన్నేళ్లపాటు సహజీవనం చేశారు. ఒకరికొకరు అన్నట్లుగా ఉండేవారు. అయితే కొంతకాలంగా సమంత రే మియర్స్‌ ప్రవర్తనలో మార్పు రావడం, ప్రతిదానికి చెప్పిందే జరగాలని, ఓ సైకోలా ప్రవర్తిస్తుందన్న కారణంతో ప్రియుడు బ్రేకప్ చెప్పాడు. దీంతో నన్నే వదిలేస్తావా అంటూ ప్రియుడిపై కక్ష పెంచుకుంది సమంత రే మియర్స్. ఎలాగైనా అతన్ని రేప్ చేసి ప్రియుడిపై పగ తీర్చుకోవాలనుకుంది. దీంతో అతడు ఇంట్లో లేని సమయంలో లోపలికి చొరబడి తలుపుచాటున దాక్కుంది. అతడు ఇంటికి వచ్చి తలుపు తాళం తీసి ఇంట్లోకి వస్తున్న సమయంలో ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. మెడపై కత్తిపెట్టి అతన్ని రేప్ చేసింది. రేప్ సమయంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రియుడి చేతిని కొరికిపారేసింది. అతడు ఎంతచెప్పినా వినకుండా భయపెట్టి రేప్ చేసింది. అంతేకాకుండా రేప్ చేసిన తర్వాత బెడ్ పై మూత్రవిసర్జన కూడా చేసింది. చివరకు ఎమర్జెన్సీ నెంబర్ కు బాధితుడు సమాచారమిచ్చాడు. అక్కడి పోలీసులు వచ్చేలోపై అక్కడినుంచి నిందితురాలు ఎస్కేప్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో కూడా నిందితురాలు సమంత రే మియర్స్ బాధితుడి ఇంట్లో అతడి జుట్టు లాగి, మొఖంపై కొట్టి, అతడిని చంపడానికి ప్రయత్నించింది. ఈ కేసులో మాజీ ప్రియుడి నుంచి దూరంగా ఉండాలని ఆమెకు కోర్టు జరిమానా కూడా విధించింది.

Posted in Uncategorized

Latest Updates