మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతా మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఇవాళ (బుధవారం) ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వైద్య కాలేజీలోని ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలోని సుమారు 250 మంది పేషెంట్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆస్పత్రిలోని రోగులు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు ఫైర్ సిబ్బంది.

ఫార్మసీ డిపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కొంతమంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల్లోంచి దూకినట్లు వారు చెప్పారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న రోగులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Posted in Uncategorized

Latest Updates