మెడికల్ కాలేజీల్లో 2,378 ఉద్యోగాలు

MEDICAL JOBS TSనిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. వైద్యారోగ్యశాఖకు సంబంధించి 2 వేల 378 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేటలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలీజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం (జూన్-12) ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి దవాఖానల్లో ఒక్కోదానికి వేర్వేరుగా 952 రెగ్యులర్ పోస్టులు,  237 తాత్కాలిక పోస్టుల చొప్పున మంజూరు చేశారు. రెండు కళాశాలలు, దవాఖానల్లో మొత్తం కలిపి 2 వేల 378 పోస్టులను భర్తీ చేస్తారు.

వీటిలో రెగ్యులర్ పోస్టుల్లో.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్/డెమాన్‌స్ట్రేటర్, ల్యాబ్ టెక్నీషియన్స్/టెక్నీషియన్స్, స్టోర్ కీపర్/ క్లర్క్/కంప్యూటర్ ఆపరేటర్, చీఫ్‌ బయో కెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్-1/గ్రేడ్-2 సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ఈసీజీ టెక్నీషియన్, TB అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, సైక్రియాట్రిక్, సోషల్ వర్కర్, హెల్త్ ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, రికార్డుక్లర్క్/రికార్డు అసిస్టెంట్, ఫిజియో థెరపిస్ట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, రిఫ్రాక్షనిస్ట్, ఆప్ట్టీషియన్, థియేటర్ అసిస్టెంట్, మేల్‌ నర్సింగ్ బ్లడ్‌ బ్యాంక్ ఆఫీసర్/సెల్ సెపరేషన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కానున్నాయి.

Posted in Uncategorized

Latest Updates