మెరుగైన విద్య అందించేందుకే రెసిడెన్షియల్ స్కూల్స్: వివేక్ వెంకటస్వామి

vivekదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. పేదలకు మెరుగైన విద్యను అందించేందుకే ఈ స్కూళ్లను ప్రారంభించిందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఒర్రెగడ్డ గవర్నమెంట్ స్కూల్ కు విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 75బెంచీలను అందజేశారు వివేక్. ఆయనకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు టీచర్లు. పాడైన ఒర్రెగడ్డ పాఠశాల అభివృద్దికి కృషి చేస్తానని వివేక్ హామీ ఇచ్చారు. అంతకుముందు లక్సేట్టిపేట మాజీ జడ్పిటీసీ తిప్పని లింగయ్య కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు వివేక్ వెంకటస్వామి.

Posted in Uncategorized

Latest Updates