మెరుపు వేగంగా : సర్టికల్ దాడులను లైవ్ తీసిన ఆర్మీ

SURGICAL VIDEOపాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు కొన్ని జాతీయ ఛానెళ్లు ప్రసారం చేశాయి. 2016 సెప్టెంబర్ లో భారత భూభాగం నుంచి.. ఉగ్రవాదులు మాటు వేసిన ప్రాంతాల్లోకి చొచ్చుకు వెళ్లి మెరుపు దాడులు చేసింది సైన్యం. ఆర్మీ దాడుల్లో చాలామంది ఉగ్రవాదులు హతం అయ్యారు.

చొరబాటుదారులు ఆక్రమించుకోవడానికి జరిగిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని రక్షణ శాఖ తెలిపింది. డ్రోన్ లాంటి గాల్లో తిరిగే రిమోట్ వాహనాల్లో అమర్చిన కెమెరాలు.. థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి.. సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు రికార్డ్ చేసినట్టు భావిస్తున్నారు. ఈ వీడియోలను చూస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తీరును ఆర్మీ అధికారులు మానిటర్ చేసినట్టు తెలుస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి.. ధ్వంసమైన బంకర్లు, ఉగ్రవాదుల మృతదేహాలు, మిలటరీ నిర్మాణాలు వీడియోల్లో ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates