మెర్కురి గొప్ప సినిమాగా నిలుస్తుంది : డైరెక్టర్ సందీప్

Mercury

ప్రభుదేవా లీడ్ రోల్ లో పెన్‌ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ బ్యానర్ పై కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ మెర్కురి. ఈ మూవీ ఏప్రిల్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగులో కె.ఎఫ్‌.సి.ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ విడుద‌ల చేస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది.  ప్రభుదేవా, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ షోకి ప్రత్యేక అతిథిగా వచ్చారు.

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..  ఈ మద్యకాలంలో ఇలాంటి థ్రిల్లర్ సినిమాని చూడలేదన్నారు. ప్రభుదేవా నటన గొప్పగా  ఉందన్నారు. సంతోష్ నారాయణ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అని.. సినిమాని ఉత్కంఠంగా చూశానన్నారు. ఆర్ట్ వర్క్ సైకలాజికల్ థ్రిలర్స్ ని రూపొందించే హాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ఫిన్చర్ సినిమాలను గుర్తుకు తెచ్చింది. ఇంత లోతైన థ్రిల్లర్  ఫిల్మ్ ని గతంలో ఎప్పుడూ చూడలేదని.. మెర్కురి మూవీ ఒక మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందించిందన్నారు సందీప్ రెడ్డి వంగా.

 

Posted in Uncategorized

Latest Updates