మెల్‌ బోర్న్ టెస్ట్ : లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్-57/1

మెల్ బోర్న్:  నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇవాళ మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ ..టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లే మయాంక్ అగర్వాల్ మెల్‌ బోర్న్ టెస్టులో అరంగేట్రం చేశాడు. అతనికి జోడీగా తెలుగు కుర్రాడు హనుమ విహారి ఓపెనర్‌ గా బరిలో దిగాడు.

పెర్త్‌ లో విఫలమైన పేసర్‌ ఉమేశ్ యాదవ్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తీసుకున్నట్లు విరాట్ తెలిపాడు. లంచ్ బ్రేక్ కు 28 ఓవర్లలో వికెట్ నష్టానికి భారత్ స్కోర్-57 రన్స్ చేసింది. 40 పరుగుల దగ్గర ఓపెనర్‌ విహారి, కమిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 66 బంతులు ఆడిన విహారి 8 పరుగులు చేశాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్‌‌(34), పుజారా(10) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates