మెల్ బోర్న్ టెస్ట్ : ఆటముగిసే సమయానికి భారత్ స్కోర్-54/5

మెల్‌ బోర్న్‌: నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ లో భారత బ్యాట్స్‌ మెన్‌ తడబడ్డారు. మూడో రోజు(ఇవాళ) ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 54 రన్స్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో బిగ్ స్కోరు చేసి, దూకుడు మీదున్న కోహ్లీసేనను..  రెండో ఇన్నింగ్స్‌ లో అడ్డుకుంది ఆసిస్. పుజారా, కోహ్లీ డకౌట్‌ అవ్వడంతో..బిగ్ టార్గెట్ ని ఆస్ట్రేలియా ముందుంచే అవకాశం ఆల్మోస్ట్ టీమిండియాకు చేజారినట్లయింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో.. పాట్‌ కమిన్స్‌ నాలుగు వికెట్లు, హేజి ల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీసి, టీమిండియా బ్యాట్స్‌ మెన్‌ దూకుడును అడ్డుకున్నారు. ప్రస్తుతం టీమిండియా 346 పరుగుల లీడ్ లో ఉంది.

Posted in Uncategorized

Latest Updates