మేకిన్ ఇండియాలో స్వీడన్ అతిపెద్ద భాగస్వామి : మోడీ

3dమేకిన్ ఇండియా లో స్వీడన్ అతిపెద్ద భాగస్వామి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కార్యక్రమం ప్రారంభం నుంచే స్వీడన్ భాగస్వామ్యం ఉందన్నారు. 2016లో ముంబయిలో జరిగిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి ప్రధానమంత్రి స్టీఫన్ లవేన్ స్వీడన్ బిజినెస్ ప్రతినిధులను తీసుకొచ్చిన విషయం గుర్తు చేశారు. స్వీడన్ లో పర్యటిస్తున్న మోడీ… ఆ దేశ ప్రధానమంత్రి స్టీఫన్ లవేన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, స్టార్టప్స్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలపై తాను స్టీఫన్ లవేన్ చర్చించామన్నారు మోడీ. భారత్ అభివృద్ధిలో స్వీడన్ పాత్ర విన్-విన్ పార్ట్ నర్ షిప్ లా ఉంటుందన్నారు.
అంతకుముందు స్వీడన్ రాజదంపతులను కలిశారు నరేంద్ర మోడీ. రాజు కార్ల్-16తో సమావేశమయ్యారు. తర్వాత స్వీడన్ ప్రధానమంత్రి అధికారిక నివాసానికి వెళ్లారు. ఇద్దరు ప్రధానమంత్రులు కలసి ద్వైపాక్షిక చర్చలు జరిగే ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. చర్చల సందర్భంగా ఇన్నోవేషన్ పార్ట్ నర్ షిప్, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.

Posted in Uncategorized

Latest Updates