మేఘాలయ, నాగాలాండ్‌లో కొనసాగుతున్న పోలింగ్

NAGACEమేఘాలయ, నాగాలాండ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం (ఫిబ్రవరి-27) సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మేఘాలయలో 60, నాగాలాండ్‌లో 60 శాసనసభస్థానాలు ఉన్నాయి. రెండు రాష్ర్టాల్లో ఒక్కో స్థానానికి ఎన్ని నిలిచిపోయింది. మేఘాలయాలోని విలియమ్‌నగర్‌లో ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ ఎన్‌సీపీ అభ్యర్థి హత్యతో ఎన్నికను వాయిదా వేశారు. నాగాలాండ్‌లోని ఉత్తర అంగామీ స్థానంలో ఎన్నిక ఏకగ్రీవమైంది. NDPC అభ్యర్థి నిపియు రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బీజేపీ 47 స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో బరిలో దిగింది. నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో కలిసి BJP 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. మార్చ్ 3న త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates