మేడారంపై వెంకయ్య : జాతరను చూసి చాలా చాలా థ్రిల్ అయ్యాను

venkaiah-naidu-on-medaramమేడారం జాతర అనుభవాలను రాజ్యసభలో పంచుకున్నారు ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు. జాతర బ్రహ్మాండంగా జరిగిందన్నారు వెంకయ్య. జాతర విశేషాలు, సమ్మక్క-సారలమ్మల విశిష్టతను ఎంపీలకు వివరించారు. 8 రాష్ర్టాల నుంచి కోటి 50లక్షల మంది జాతరకు వచ్చారన్నారు. జాతరను మినీ కుంభమేళాగా  వర్ణించారు వెంకయ్య. మేడారం జాతర చూసి చాలా చాలా థ్రిల్ అయ్యాను అన్నారు. గిరిజనుల క్రమశిక్షణ ఆశ్చర్యం అన్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. చత్తీస్ గడ్  ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సైతం జాతరకు హాజరైన విషయం గుర్తు చేశారు వెంకయ్య.

Posted in Uncategorized

Latest Updates