మేడారం జాతర హుండీ లెక్కింపు పూర్తి

hundi0212తెలంగాణ కుంభమేళ మేడార సమ్మక్క సారలమ్మ జాతరను ఈ సారి ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడమే కాకుండా.. కానుకలూ బాగానే సమర్పించుకున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు నేటితో పూర్తైంది.

హన్మకొండ TTD కల్యాణ మండపంలో గత వారం రోజుల నుంచి కొనసాగిన లెక్కింపు సోమవారం (ఫిబ్రవరి-12)తో ముగిసింది. మొత్తం 479 హుండీల లెక్కింపు పూర్తి అయింది. మేడారం జాతర ఆదాయం రూ. 10 కోట్ల 17 లక్షల, 50 వేల 363 వచ్చినట్లు వెల్లడించారు అధికారులు. అదేవిధంగా 824 గ్రాముల బంగారం, 47 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు.

 

 

Posted in Uncategorized

Latest Updates