మేడ్చల్ లో మంటలు.. రెండు అగ్ని ప్రమాదాలు

మేడ్చల్ జిల్లా :  మేడ్చల్ లో రెండు వరుస అగ్నిప్రమాదాలు స్థానికులకు దడ పుట్టించాయి. మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామంలో ఉన్న డీఆర్ఎస్ గోడౌన్ లో ఇవాళ శుక్రవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. చెత్త కుప్పలను ఎవరో తగులబెట్టడంతో.. ఆ మంటల తీవ్రత పెరిగి.. పక్కనే ఉన్న గోడౌన్ కు అంటుకున్నాయి. గోదాం మొత్తం మంటలకు ఆహుతైపోయింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.

ఇండస్ట్రియల్ ఏరియాలో మరో ప్రమాదం

మేడ్చల్ పారిశ్రామికవాడలోని ధర్మకోల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు వస్తున్న సంగతి తెల్సుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్ చేరుకున్నారు. ఉదయం ఓ ప్రమాదంలో .. సాయంత్రానికి మరో ప్రమాదంతో ఫైర్ డిపార్టుమెంట్.. పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. రెండు ఘటనల్లో ప్రాణ నష్టం ఏమీ జరగలేదనీ… ఆస్తినష్టం జరిగిందని పోలీసులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates