మేడ్చల్ లో విషాదం.. కోళ్ల ఫారంలో నలుగురు యువకులు మృతి

 మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షామీర్ పేట్ మండలం బొమ్మరాశి పేటలోని కోళ్ల ఫారంలో నలుగురు యువకుల అనుమానాస్పదంగా చనిపోయారు. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సతీశ్ గౌడ్(20), అరవింద్‌‌గౌడ్(23), మహేశ్ ముదిరాజ్(20), మహేందర్ రెడ్డి(25)గా గుర్తించారు. కోళ్ల ఫారంలో నెల రోజులుగా యువకులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

గురువారం రాత్రి కోళ్లకు వ్యాక్సిన్ వేసి చేతులు కడుగకుండా అన్నం తినడంతో చనిపోయారని పోలీసులు అనుమాస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన యువకులు చనిపోవడంతో వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన యువకులు వీరే..

Posted in Uncategorized

Latest Updates