మేనమామ మాయమాటలు : దోషం పోతుందని నాలుగేళ్లుగా అత్యాచారం

అత్యాచారాలపై కోర్టులు ఎన్ని శిక్షలు వేస్తున్నా దేశంలో రోజూ ఎక్కడో చోటా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేస్తే దోషం పోతుందని మాయమాటలు చెప్పి యువతిని లొంగతీసుకున్నడు స్వయానా ఆమె మేనమామ. ఈ దారుణ సంఘటన ఢిల్లీలో జరిగింది. ఆమె జాతకంలో దోషం ఉందని..అత్యాచారం చేస్తే ఆ దోషం తొలగిపోతుందని నమ్మబలికాడు.

ఆ దోషం సరి చేసుకోకపోతే తండ్రి చనిపోతాడని చెప్పి నిందితుడు బాధితురాలిని లొంగదీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేనకోడలు అని కూడా చూడకుండా 23 ఏళ్ల యువతిపై గత నాలుగేళ్లుగా లెక్కలేనన్ని సార్లు అత్యాచారం జరిపాడని వెల్లడించారు. యువతికి వివాహం జరిగాక కూడా నిందితుడు ఈ అఘాయిత్యాన్ని ఆపలేదు. దీంతో విషయాన్ని యువతి తన బంధువులకు చెప్పడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. ఇవాళ (అక్టోబర్-2) నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. యువతిని ఢిల్లీలోని మహిళా సంరక్షణ గృహానికి తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates