మేమున్నాం ధైర్యంగా ఓటెయ్యండి

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల సందర్భంగా సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సూరారం కాలనీ, రాజీవ్ గృహకల్ప, సాయిబాబానగర్లో డప్పుచప్పుళ్లతో ఈ ఫ్లాగ్‍ మార్చ్ కొనసాగింది. మీ వెనుక మేమున్నాం ధైర్యంగా ఓటు వేయమని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ సీఐ వెంకటేశం, ఎస్‍ఐలు శేఖర్ డ్డి, భూపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నా రు.

మలక్ పేట: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పూసలబస్తీ, ఖాజాబాగ్,అక్బర్ బాగ్, సింగరేణి కాలనీ, సరస్వతి కాలనీబస్తీలలోని గల్లీలో మలక్ పేట ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో సైదాబాద్ పోలీసులు, ఆర్పీఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సైదాబాద్ ఇన్ స్పెక్టర్ నర్సింహారావ్, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ సురేష్  సబ్ ఇన్ స్పెక్టర్  రాము, ఆర్ పీఎఫ్ భద్రతా సిబ్బంది పాల్గొ న్నారు.

మాదాపూర్ : ప్రజలు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్ ని ర్వహిస్తున్నట్లు గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. గచ్చిబౌలి పోలీస్‍ స్టేషన్పరిధిలోని వట్టినా గులపల్లి, కేశవ్ నగర్, నానక్రాం గూడలలో పోలీసులు సోమవారం కవాతు నిర్వహించారు.

కుత్బుల్లా పూర్ : ఓటర్లను చైతన్యచేసేందు కు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోసీఐ వెంకటేశం ఆధ్వర్యంలో సూరారం కాలనీ, రాజుగృహ కల్ప సాయిబాబానగర్లో సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్ఐలు శేఖర్ రెడ్డి, భూపాల్ గౌడ్, ఆర్పీఎఫ్ సిబ్బంది,సెంట్రల్ ఫోర్స్ పాల్గొ న్నారు. చాంద్రాయణగుట్ట,

వెలుగు: బాలాపూర్, పహా-డిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కవాతు జరిగింది. వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ ఆధ్వర్యంలో 100 మంది ఆర్ పీఎఫ్‍ బలగాలతో అలీనగర్, వాడీఏ ముస్తఫా, ముస్తఫా హిల్స్,ఖుబా కాలనీ తదితర ప్రాంతాలలో పోలీసులు మార్చ్ నిర్వహించారు. ఆర్పీఎఫ్‍  సీఐ గిరీష్, బాలాపూర్ సీఐ సైదులు, పహాడి షరీఫ్ సీఐ శంకర్ తో పాటు సిబ్బం ది కవాతులో పాల్గొ న్నారు.

Latest Updates