మేము సైతం : గురుకులాల్లో సైనిక శిక్షణ

GIRLSఅమ్మాయిలను అన్ని రంగాల్లో రాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. తెలంగాణలో ప్రమాణాలతో కూడిన విద్యావిధానానికి బాటలు వేసిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థ  విద్యాలయాల సంస్థ.. దేశంలో తొలిసారిగా గురుకుల సైనిక శిక్షణ పాఠశాలను ప్రారంభించనుంది.

ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లో ఉన్న బాలుర గురుకులాన్ని సైనిక శిక్షణ విద్యాసంస్థగా మార్చి, వచ్చే విద్యాసంవత్సరం(2018-19) నుంచి 5, 11 తరగతులతో సైన్యంలో చేరేందుకు వీలైన అంశాలతో విద్యాబోధనను చేపట్టనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో  గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాచరణను ప్రారంభించింది. ఇది విజయవంతమైతే వచ్చేఏడాది సూర్యాపేట జిల్లా నాగారంలో దేశంలోనే తొలిసారి బాలికల కోసం సైనిక శిక్షణ పాఠశాలలను ప్రారంభించాలని చూస్తోంది.

సైన్యంలో చేరేందుకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంకల్పంతో కేంద్ర రక్షణశాఖ దేశంలో సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఇందులోని విద్యార్థులకు జాతీయ రక్షణసంస్థ(NDA), నావిక సంస్థ(నావల్‌ అకాడమీ) పరీక్షల ద్వారా ప్రవేశాలు పొంది ఉద్యోగాలు పొందేందుకు మార్గనిర్దేశం చేస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రుక్మాపూర్‌లో సైనిక శిక్షణ పాఠశాల ప్రారంభమవుతున్నందున బాలికల కోసం ప్రత్యేకంగా ఇలాగే కొత్త గురుకులాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్ణయించారు. దీనికి అనుగుణంగా గురుకుల విద్యాలయాల సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 2019-20లో ఇది కార్యకూపం దాల్చనుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates