మేమూ వచ్చాం : జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ వచ్చేసింది

jio-paymentsరిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోట్‌ చేసిన జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ (JPB) సేవలు ప్రారంభం అయ్యాయి. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 3వ తేదీ మంగళవారం అధికారికంగా తెలిపింది. 2015 ఆగస్టులో పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందిన 11 సంస్థల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఒకటి.

రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ ద్వారా జియో పేమెంట్స్‌ బ్యాంకు సేవల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రిలయన్స్‌ భావిస్తోంది. మొబైల్ నెట్ వర్క్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలన్నీ కూడా పేమెంట్స్ బ్యాంక్ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్‌ 2016 నవంబర్‌లోనే పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పుడు జియో కూడా పేమెంట్స్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా గ్రూప్ (ఐడియా) కూడా పేమెంట్ బ్యాంక్ సర్వీసులను ఫిబ్రవరిలోనే ప్రారంభించింది.

 

Posted in Uncategorized

Latest Updates