మేయర్ నిరసన : మోకాళ్ల లోతు నీళ్లలో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు

వర్షపు  నీళ్లలో  నగరాలన్నీ మోకాళ్లలోతు  మునిగిపోయాయి. వర్షపు నీటిలో  జనం ఇబ్బందులు  అన్నీ ఇన్నీ కావు. చాలాప్రాంతాల్లో  నీళ్లు  నిలిచిపోవడంపై  మండిపడుతున్నారు  జనం. అయితే  మధ్యప్రదేశ్  భోపాల్ మేయర్  మాత్రం  తన సొంత పార్టీ… అధికార  పార్టీపైనే  తిరుగుబాటు ప్రకటించారు.  భోపాల్ లోని  ఓ ప్రాంతంలో మోకాళ్ల  లోతు  నీళ్లల్లో…. కుర్చీ వేస్కుని  కూర్చుని  నిరసన తెలిపారు. సిటీలో  ఎక్కడెక్కడ నీళ్లు నిలిచిపోయాయో..  అక్కడి కి  వెళ్లి  అలాగే నిరసన  వ్యక్తం చేస్తానన్నారు . ఏడాదికాలంగా  జిల్లా  కలెక్టర్, సంబంధిత  మంత్రి,  ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి.. అన్ని స్థాయిల్లో  సమస్య గురించి  వివరించినా  పరిస్థితిలో మార్పు  రాలేదని… అందుకే  ఇలా నిరసనకు  దిగినట్టు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates