మే 1 నుంచి GHMC సమ్మర్ కోచింగ్ క్యాంపులు

CHILDRENజీహెచ్‌ఎంసీ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు మే 1 నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్‌ పరిధిలో సుమారు లక్షన్నర మందికి 46 క్రీడాంశాలను 829 కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తమ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జీహెచ్‌ఎంసీ నిర్వహించే సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపుల్లో పాల్గొనే సభ్యులు www.ghmc.gov,in/sports వెబ్‌సైట్‌ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. క్రికెట్‌, టెన్నీస్‌, స్కేటింగ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందేవారు ఆధార్‌కార్డు, మొబైల్‌ నెంబర్‌తో పాటు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర క్రీడాంశాలకు రూ. 10 చెల్లించాలి.

 

Posted in Uncategorized

Latest Updates