మే 19న ఎంసెట్ ఫలితాలు

TS-EAMCET-Resultమే 19న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి ఆ శాఖకు చెందిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో మొదటి సారిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈసారి ఎంసెట్‌ను JNTUH నిర్వహించింది. మే 2 నుంచి 7 వరకు పరీక్షలు జరిగాయి. ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

రాష్ట్రంలో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టీకల్చర్, బీఎస్సీ (ఫారెస్ట్రీ), బీవీఎస్‌సీ అండ్ యానిమల్ హస్బెండరీ, బీఎఫ్‌ఎస్‌సీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్), బీఫార్మసీ, బీటెక్ (బయోటెక్నాలజీ), ఫార్మాడీ,బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోటెక్నాలజీ  సబ్జెక్టులలో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు.

ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/టీటెక్, బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (బయోటెక్నాలజీ ఫర్ ఎంపీసీ),ఫార్మా-డీ ఫర్ ఎంపీసీ (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ),బీటెక్ (ఫుడ్‌టెక్నాలజీ)  సబ్జెక్టుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates