మే 6న నీట్

NEET-2018మే 6వ తేదీన నిర్వహించనున్న వైద్య, దంత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.ఈ పరీక్ష కోసం మార్చి 9వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో రుసుమును  మార్చి 10వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చని సీబీఎస్‌ఈ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అస్సోం, జమ్ముకశ్మీర్‌, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల అభ్యర్థులు ఆధార్‌ సంఖ్యను దరఖాస్తులో తప్పనిసరి నింపాలి. ఆధార్‌లో ఉన్న వివరాలతో (పేరు, పుట్టిన తేదీ తదితరాలు) సరిపోకపోతే దరఖాస్తును భర్తీ చేయటం సాధ్యంకాదని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కూడా 2018-19 విద్యా సంవత్సరం నుంచి తమకు సంబంధించిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల నుంచి 15శాతాన్ని అఖిలభారత కోటా కింద కేటాయించటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా అఖిలభారత సీట్లను పొందటానికి అర్హులవుతారు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశంఉంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను సీబీఎస్‌ఈనీట్‌ వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates