మైండ్ పోయింది : ఇలాంటి షూ ఎప్పుడైనా చూశారా


షూ అనగానే మనం రెగ్యులర్ గా వాడేవి గుర్తుకొస్తాయి. ప్యాంట్ అనగానే రెగ్యులర్, జీన్స్ గుర్తుకొస్తాయి.. అదే జీన్స్ ప్యాంట్ వలే ఉన్న షూను ఎప్పుడైనా చూశారా.. ఇప్పటి వరకు ప్రపంచం కూడా ఊహించని కొత్త రకం షూ ధరించి మతిపోగొట్టింది హాలీవుడ్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్. ఓ షోకి హాజరైన ఆమె ధరించిన షూ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. వెరైటీ ఊహించాం కానీ.. మరీ ఇంత వెరైటీని మాత్రం కలలో కూడా ఊహించలేదని అంటోంది సోషల్ మీడియా.

ఈ షూ ఎలా ఉన్నాయి అంటే.. జీన్స్ ప్యాంట్ ఉన్నట్లే ఉన్నాయి. షూకి లింక్ చేసి ఉన్న ప్యాంట్ వలే ఉన్నాయి. దానికి బెల్ట్ కూడా ఉంది. ఓ ముక్కలో చెప్పాలంటే ప్యాంట్ జారిపోతే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉన్నాయి ఈ షూ. బెల్ట్ తోపాటు.. పాకెట్స్ కూడా ఉన్నాయి. మొదట చూసినోళ్లు అందరూ కూడా ప్యాంట్ జారిపోయింది అని అనుకున్నారు.. కొందరు అయితే కేకలు వేసి మరీ చెప్పారంట. వాళ్లను వింత చూడటంతోపాటు.. కిందకు చూడండీ అంటూ సైగ చేసింది జెన్నిఫర్. అప్పుడు కానీ అక్కడ ఉన్నోళ్లకు అర్థం కాలేదు. అవి షూ అని.. ఏమైనా వెరైటీ మరి వైవిధ్యంగా మారిపోయింది అనటానికి ఇదో ఉదాహరణ.

Posted in Uncategorized

Latest Updates