మైండ్ బ్లోయింగ్ డెసిషన్ : ఉద్యోగులకు చెల్లించే బిల్లులపైనా GST

GST-employsషాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేట్ కంపెనీల్లోని ఉద్యోగుల రీఎంబర్స్ మెంట్ పైనా గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ విధించాలని నిర్ణయానికి వచ్చింది GST కౌన్సిల్. ఈ మేరకు వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఫైనల్ డె

సిషన్ తీసుకోబోతున్నారు. ఔట్ వార్డ్ సప్లయ్ పేరు కింద సెక్షన్ 2(83) ఆఫ్ యాక్ట్ 2017 కింద ఈ కొత్త రూల్ అమల్లోకి తీసుకురాబోతున్నారు.

ఉదాహరణకు మీరు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. టూర్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అందుకు సంబంధించి రూ.10వేలు బిల్లు అయ్యింది. ఈ మొత్తాన్ని రీఎంబర్స్ మెంట్ కింద కంపెనీ మీకు చెల్లిస్తుంది. కొత్త రూల్ ప్రకారం ఆ 10వేల రూపాయలపైనా జీఎస్టీ కట్టాలి. ఇది జీతాలు చేసే ఉద్యోగులకు నిజంగా షాకింగ్. అంతేకాకుండా కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసినా జీఎస్టీ చెల్లించాలి. అంతే కాదండీ కంపెనీ మీకు ఇచ్చే  టెలిఫోన్ బిల్లులపైనా కొత్త తరహా బాదుడు ఉండబోతున్నది. హెల్త్ చెక్ అప్, జిమ్ ఛార్జీల రీఎంబర్స్ మెంట్ అమౌంట్ కు ఈ ఛార్జి విధించనున్నారు. అదే విధంగా ఉద్యోగుల ఎంటర్ టైన్ మెంట్ కోసం కంపెనీలు చెల్లించే ప్యాకేజీపైనా ఇక నుంచి ఉద్యోగులు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.

అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ (AAR) నిబంధనల కింద క్యాంటిన్ ఛార్జీస్ పేరుతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. దీనిపై రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోద ముద్ర వేయటానికి రంగం సిద్ధం అయ్యింది. అంటే ఇక నుంచి కంపెనీ నుంచి మీరు పొందే రీఎంబర్స్ మెంట్ కు మీరు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.. అయితే ఇది ఎంత శాతం ఉండాలనే విషయంలో స్పష్టత రాలేదు. అత్యధికంగా 5శాతం విధించాలని భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates