మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ కన్నుమూత

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ ఎలెన్‌ చనిపోయారు. కొంత కాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూసినట్లు ఆయన సోదరి ఓ ప్రకటన విడుదల చేశారు.

పాల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల. మైక్రోసాఫ్ట్‌ సహా టెక్‌ రంగానికి పాల్‌ అందించిన సేవలు ఎనలేనివి అని ఆయన అన్నారు. సంస్థ సహ వ్యవస్థాపకుడిగా నిరంతర శ్రమతో పాల్ ఎన్నో విజయాలు సాధించారని, ఆయనలోని ఉత్సాహం మైక్రోసాఫ్ట్‌ కుటుంబంలో నూతన ఉత్తేజాన్ని నింపిందని, పాల్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఓ ప్రకటనలో తెలిపారు.

 

బిల్‌గేట్స్‌, ఎలెన్‌పాల్‌ కలిసి మైక్రోసాఫ్ట్‌ 1975లో మైక్రోసాఫ్ట్ ని  స్థాపించారు. మైక్రోసాఫ్ట్‌లో వాటా సహా.. 20.2 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోని ధనవంతుల్లో పాల్‌ 46వ ప్లేస్ లో ఉన్నారు. 1986లో ఆయన ఉల్కన్‌ ఇంక్‌ అనే సంస్థను స్థాపించారు.

Posted in Uncategorized

Latest Updates