మైదాకు రైతు నోట్లో మట్టి.. కల్తీ హెన్నాకే గిరాకీ ఎక్కువంటూ ఆవేదన

దేశంలో చాలారాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వాలు ఎంత గిట్టుబాటు కల్పించినా.. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం గిట్టుబాటు రేటు కొంత పెంచినా… అదేం రైతులకు సరిపోవడం లేదు. చెమటలు చిందించి… కష్టపడి రైతులు పండించే నాణ్యమైన పంటల కన్నా… కల్తీ సరుకుకే మార్కెట్లో గిరాకీ ఎక్కువ. రాజస్థాన్ లోనూ హెన్నా పంటలు పండించే రైతులు కూడా ఇదే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఏ వేడుక జరిగినా మతాలతో సంబంధం లేకుండా మెహెందీని పెట్టుకుంటారు మహిళలు. హెన్నాకు మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంటుంది. ఐతే… హెన్నా పంట పండించే రైతులు మాత్రం నష్టాలపాలవుతున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హెన్నా ఎక్కువగా పండుతుంది. తమ పంటను కొనడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు రాజస్థాన్ లోని రైతులు. “డూప్లికేట్ హెన్నా అమ్మేవాళ్లు లక్షల్లో సంపాదిస్తున్నారు. వందశాతం ఒరిజినల్ హెన్నా ఇస్తున్నా మా దగ్గర ఎవరూ కొనడం లేదు” అంటున్నారు. మార్కెట్లో కల్తీ హెన్నాకే డిమాండ్ ఎక్కువగా ఉందని… రైతులు ఇపుడు హెన్నాను పండించడం కూడా ఆపేస్తున్నారని రైతులు ఆవేదనగా చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates