మైనర్లు కాదు..మహా ముదుర్లు : మహిళా వేధింపుల్లో వీరే ఫస్ట్

మహిళా రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నాయి హైదరాబాద్ షిటీమ్స్. అయితే ఇటీవల వేధింపులు వస్తున్న ఫిర్యాదుల్లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయని తెలిపారు షీటీమ్స్ అధికారులు. ఆకతాయిలు, పోకిరీల నుంచి మహిళలను కాపాడుతున్న షిటీమ్స్ కు ఊహించని సంఘటనలు వెలుగుచూస్తున్నట్లు తెలిపారు. మహిళలను వేధిస్తున్న వారిలో మోడోవంతు మైనర్లేనని తెలిపింది షీమ్స్. మైనర్లుకాదు..వీళ్లు మహాముదుర్లు అన్నారు. మహిళా భద్రత విభాగం

లెక్కల్లో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయని వెల్లడించారు. మూడేళ్లకాలంలో మొత్తం 3106 మంది మైనర్లు షీటీంలకు పట్టుబడగా..అందులో 14, 15 ఏళ్ల బాలురు..తమకంటే  వయసులో పెద్దవారిపైనా అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు తేలిందన్నారు. వేధింపుల్లో పట్టుబడ్డవారిలో అయితే 6652 మంది 18 నుంచి 24 వయపు యువకులే ఉన్నారన్నారు షిటీమ్స్ అధికారులు.

వేధింపులకు గురైన మహిళలు ఒకప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే పరువు మర్యాదల్ని దృష్టిలో ఉంచుకొని ముందుకువచ్చేవారుకాదు. అయితే షిటీమ్స్  పనితీరుతో పరిస్థితిలో కొంతమార్పు కనిపిస్తోంది. ఫోన్లో ఫిర్యాదు చేయడమే కాదు వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేసే బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం 8711 మంది వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయగా డయల్‌ 100 ద్వారా సంప్రదించిన వారి సంఖ్య 2529. వాట్సాప్‌ ద్వారా 4651 మంది ఫిర్యాదు చేశారు. ఇంకా ఫేస్‌ బు క్‌, ట్విటర్‌ వంటి సోషల్ మీడియాల ద్వారా 1049 మంది అధికారులను సంప్రదించినట్లు లెక్కలు తేల్చాయి.

వేధింపులకు పాల్పడేవారెవర్నీ వదలబోమని హెచ్చరించారు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా. షిటీమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత మహిళలో ధైర్యం నెలకొనగా, ఆకతాయిలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే హైదరాబాద్‌ లో సక్సెస్ అయిన ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామన్నారు. వేధింపులకు పాల్పడేవారిని షి టీమ్స్ గమనిస్తున్నాయన్న విషయం గుర్తుకొచ్చేలా చేస్తున్నామని స్పష్టం చేశారు స్వాతి లక్రా.

 

Posted in Uncategorized

Latest Updates