మైనారిటీలపై దాడుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : కడియం

SC STఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడుల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హన్మకొండ జడ్పీ హాల్ లో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల పురోగతిపై చర్చించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆద్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అర్భన్, రూరల్ జిల్లా కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత… ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలకు సంబంధించి ప్రజలకు, పోలీసులకు అవగాహన కల్పించాలని కమిషనర్ కు సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిరక్ష్యంగా వ్యవహరించే పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Posted in Uncategorized

Latest Updates