మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి : హరీష్

HARISHప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతీ మైనార్టీ విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నామని,  ఏటా ఐదుగురు పేద  ముస్లింలను మక్కాకు పంపిస్తామని చెప్పారు హరీష్.

మంగళవారం (జూన్-5) మెదక్ పట్టణంలో పర్యటించిన హరీష్… పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. తర్వాత ర్యాలమడుగు దగ్గర హల్దీవాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. షాదీ ముబారక్, షాదీ ఖానా ద్వారా మెదక్ లోని పేద ముస్లింలు తమ ఆడపిల్లల పెళ్లిళ్లను తక్కువ ఖర్చుతో చేయవచ్చన్నారు. ఈద్గా, మసీదు మరమ్మతులకు రూ. 2 కోట్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అదే రీతిలో పేద మైనార్టీ విద్యార్థుల చదువు కోసం రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ పాఠశాల లను సీఎం ప్రారంభించారని చెప్పారు. మెదక్ లో ప్రస్తుతం ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా మరోకటి బాలికల కోసం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి హరీష్.

Posted in Uncategorized

Latest Updates