మైనింగ్ టుడే సదస్సు : గవర్నర్ కు కేటీఆర్ ఆహ్వానం

KTR-calls-onహైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదికకాబోతోంది. ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న మైనింగ్ టు డే సదస్సుకు గవర్నర్ ను ఆహ్వానించారు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కేటీఆర్. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను ఇన్వైట్ చేశారు. ఫిబ్రవరి-14 నుంచి-16 వరకు జరిగే సదస్సు ప్రాముఖ్యతను వివరించారు. ఈవెంట్ కు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఫిక్కీ సహాకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మైనింగ్ దిగ్గజ కంపెనీల అధిపతులు, వ్యాపారులు, మైనింగ్ నిపుణులు పాల్గొంటారని చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ సదస్సుతో పాటు ఈ నెలలోనే హైదరాబాద్ లో మరో రెండు అంతర్జాతీయ సదస్సులు జరగనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates