మైసూర్ టూ బెంగళూరు : జనరల్ బోగీలో ప్రయాణించిన రైల్వే మంత్రి

piyushఆయన ఓ కేంద్రమంత్రి. చుట్టూ టైట్ సెక్యూరిటీ. ఆయన రోడ్డుపైకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ జామ్ లు తప్పవు. అయితే అటువంటి వారి కష్టాలు ఎలా ఉంటాయి, సామాన్య ప్రజలు మన నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుకోవాలనే ప్రయత్నం చేసి అందరి అభినందనలు అందుకుంటున్నాడు రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్. సోమవారం(ఫిబ్రవరి19) ప్రధానమంత్రితో కలసి కొత్త ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించేందుకు మైసూర్ వచ్చిన పియూష్ గోయల్, ప్రారంభం తరువాత మైసూర్ నుంచి బెంగళూరుకి వెళ్లే కావేరి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. జనరల్ బోగీలో తిరుగుతూ ప్రయాణికులతో కలసి మాట్లాడారు. రైల్వే సేవలపైన వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకొన్నారు. ఆయనతో కలసి సెల్ఫీలు తీసుకొనేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపించారు. ఓ కేంద్రమంత్రి ఇలా సామాన్యుడిలా జనరల్ బోగీలో ప్రయాణించడం గొప్ప విషయమని, ఇదే విధంగా సమస్యలు తెలుకుంటూ, రైల్వే వ్యవస్ధలోని లోపాలను సరిచేయాలంటూ ప్రజలు పియూష్ గోయల్ కు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates