మొండి.. జగమొండీ : ట్రంప్ – కిమ్ ఇలా ఎలా మారిపోయారు?

Kim-and-Trump-meetingఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్.. చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారు. అగ్రిమెంట్ పై ఇద్దరు నేతలు సంతకాలు చేశారు. ఇంతకీ ఆ నేతలు ఏ అంశంపై ఒప్పందం కుదుర్చుకున్నారన్న అంశంపై స్పష్టం లేదు. ప్రపంచానికి ముప్పుగా మారిన అతి పెద్ద సమస్యను పరిష్కరించబోనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. కిమ్ తో పాటు తాను కూడా ఈ అంశాన్ని చర్చించినట్లు తెలిపారు. ఇద్దరి మధ్య అణు నిరాయుధీకరణపై సంతకాలు కుదిరినట్లు వెల్లడించారు. ఇతరులు ఊహించిన దాని కన్నా బెటర్ గా ఈ సమావేశం జరిగిందన్నారు ట్రంప్. త్వరలోనే కిమ్ ను వైట్ హౌజ్ కు ఆహ్వానిస్తానని ట్రంప్ తెలిపారు. కిమ్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి అని ట్రంప్ కితాబు ఇచ్చారు.

మరోవైపు  ఇది చరిత్రాత్మకం ఒప్పందం అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. త్వరలోనే ప్రపంచం అతిపెద్ద మార్పును చూస్తుందన్నారు. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ మూవీని ఈ భేటీ తలపించిందని వ్యాఖ్యానించాడు కిమ్. త్వరలోనే సమస్యలన్నీ తలగిపోతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు కిమ్.

ఉత్తరకొరియా దేశం : అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్

నార్త్ కొరియాలో కిమ్ జోంగ్  ఉన్ దేవుడి స్థాయి హోదా.  ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయరు. లిటిల్ రాకెట్ మ్యాన్..  ప్రతీకారం కోసం దేశ ప్రజలను చంపుకునే మ్యాడ్ మ్యాన్ అన్న ట్యాగ్ లైన్. ఇవీ కిమ్ వ్యక్తిత్వానికి సంబంధించి ప్రచారంలో ఉన్న బిరుదులు. 2012లో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టాక లక్షా 20 వేల మంది జైల్లో పెట్టించాడనే ప్రచారం ఉంది. అధికారం కోసం అయినవాళ్లనూ చంపుకున్నాడన్న అభియోగాలున్నాయి. తన భవిష్యత్ కోసం దేశాన్ని నాశనం చేసేందుకైనా వెనుకాడని వ్యక్తిత్వం అంటాయి మిగతా దేశాలు. అంతే కాదు..

త్రివిధ దళాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకూ కిమ్ అంటే భయం. ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే.. జనం కన్నీళ్లు పెట్టుకుని స్వాగతం పలకాలి.. వెళ్లిపోతుంటే ఏడుస్తూ వీడ్కోలు పలకాలి. ఆ భావాలు మనసులో నుంచి రాకపోయినా సరే కనీసం నటించాలి. లేకపోతే నూకలు చెల్లినట్టే. ఇలాంటి రూల్స్ ఉత్తర కొరియాలో ఉన్నట్లు చెబుతాయి మిగతా దేశాలు. అందుకే కిమ్ ను ఎదురించే సాహసం చేయలేదెవరు. అసలు ప్రతిపక్షం అన్నదే లేదంటే.. ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడిది ? అలాంటి వ్యక్తి.. ఉన్నట్లు ఉండి.. అమెరికాకు సాహో అనడం వండర్ అంటున్నారు విశ్లేషకులు. కిమ్ నుంచి ఎవరూ ఊహించని స్టెప్ ఇది. అసలు కిమ్ జోంగ్ ఉన్ లో కనిపించని కోణమిది. రాజీతత్వమే తెలియని నియంత తనదేశం కోసం ఆలోచించడం హైలైట్ అంటున్నారు.  సింగపూర్ లో పర్యటన చూసిన తర్వాత కిమ్ గురించి ఇన్నాళ్లు విన్నది అబద్దమా లేక ఆయన మారాడా అనే సందేహం అందరిలో వస్తోంది.

అమెరికా : అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ది మరో రకం వ్యక్తిత్వం. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి మరీ చెబుతారు. అనుకున్నది సాధించేందుకు అవసరమైతే మెట్టుదిగేందుకైనా.. మెడలు వంచేందుకైనా సిద్ధపడే వ్యక్తిత్వం అంటారు. అమెరికన్ ప్రెసిడెంట్ రేసులోకి రావడమే అనూహ్యమైతే.. గెలవడం వండర్. ఎప్పటికప్పుడు ప్రపంచం తన గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకునే క్యూరియాసిటీ ఆయన సొంతం. ముఖ్యంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కు ఎక్కువ ఆసక్తి చూపిస్తాడంటారు. ప్రపంచం చూపు తనమీదే ఉండాలన్న తపన ట్రంప్ ది. అందుకే అటెన్షన్ తనవైపు తిప్పుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారాయన.

మొన్నటికి మొన్న భారత్, రష్యా, చైనాలాంటి దేశాలన్నీ జీ7 సమ్మిట్ లో పాల్గొంటే.. కిమ్ జాంగ్ భేటీతో మూడ్ మొత్తం మార్చేశారు. నిజానికి కొరియాలాంటి కొరకరాని కొయ్యను దారిలోకి తెచ్చిన ప్రెసిడెంట్ గా చరిత్రలో నిలిచిపోవాలన్న తపన ట్రంప్ ది. తనకు ముందు దశాబ్దాలుగా ఉత్తర కొరియాను దారిలోకి తేవాలని 10 మందికి పైగా అధ్యక్షులు ప్రయత్నించి ఫెయిలయ్యారు. అలాంటి పరిస్థితుల్లో కిమ్ ని దారిలోకి తెస్తే ప్రపంచం మొత్తం తనను కీర్తిస్తుందని ట్రంప్ ఆలోచన. అందుకే కిమ్ ఎంత కవ్విస్తున్నా.. అప్పుడప్పుడు కౌంటరివ్వడం తప్ప పెద్దగా కవ్వించింది లేదు. వైట్ హౌజ్ లో కూర్చునే.. అణ్వస్త్రాల నిరాయుధీకరణకు ఓకే అంటేనే సింగపూర్ సమ్మిట్ అని ఆంక్షలు పెట్టారు. కొరియాలో బందీలనూ విడిపించారు. సింగపూర్ సమ్మిట్ లో ఎవరు ఎవరికి సరెండర్ అయ్యారో అర్థం కాని పరిస్థితి. కానీ కిమ్ కు కళ్లెం వేసింది ట్రంపేనన్నది మాత్రం జనమెరిగిన సత్యం.. నడుస్తున్న వాస్తవం.

Posted in Uncategorized

Latest Updates