మొక్కతో సెల్ఫీ..జైలు పాలు చేసింది

selfieమొబైల్ చేతిలో ఉంటే చాలు.. యూత్ కు పట్టపగ్గాలుండవు. సమయం,సందర్భం లేక పోయినా సెల్ఫీలు తీసుకుంటారు.  సెల్ఫీ లు తీసుకోవడంతో పాటు వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. అలాంటి సెల్ఫీనే ఓ యువకుడిని జైలుపాలు చేసింది.

చెన్నై వీఎ‌మ్ స్ట్రీట్‌కు చెందిన శశికుమార్… దర్గా వీధిలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి టెర్రస్ పైకి వెళ్లాడు. అక్కడ కుండీల్లో ఉన్న రకరకాల మొక్కలు, అందమైన పూలచెట్లు కన్పించాయి. అంతే తన మొబైల్ కు పని చెప్పాడు. సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపాడు. ఫ్రెండ్ ఇంటి నుంచి వెళ్లాక అక్కడ తీసుకున్న ఫోటోలన్నీ ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ చేశాడు. చివరికి ఓ మొక్కతో దిగిన ఈ సెల్ఫీనే అతడ్ని జైలుపాలు చేసింది. ఇంతకీ శశికుమార్ చేసిన తప్పెంటో తెలుసా… గంజాయి మొక్కతో కలిసి ఫోజు ఇవ్వడం. ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కొద్దిసేపటికే ఈ సెల్ఫీ వైరల్‌గా మారింది. ఆ విషయం కాస్తా పోలీసులకు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆరా తీసిన పోలీసులు శశికుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ గంజాయి మొక్కను ఇంటిపై కుండీలో పెంచుతున్న అతడి స్నేహితుడు కమల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మూర్తి అనే మరో వ్యక్తిని కూడా కటకటాల్లోకి నెట్టారు.  శశికుమార్, కమల్, మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ రిమాండ్‌లో ఉన్నారు. ఏదో సరదాగా సెల్ఫీ దిగితే… అది కాస్తా ఏకంగా జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది.

Posted in Uncategorized

Latest Updates