మొగుడు కాదు మృగం.. అదనపుకట్నం కోసం ఇస్త్రీపెట్టెతో కాల్చాడు

iron-box
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యపై పైశాచికత్వం చూపించాడు ఓ భర్త. ఇస్త్రీ పెట్టెతో కాల్చి …చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ లంగర్ హౌస్ లో జరిగింది ఈ ఘటన. సిటీలో షేక్ పేట్ నాళాకు చెందిన జ్యోతికి.. ప్రశాంత్ కూమార్ తో 2012లో వివాహం జరిగింది. టీచర్ గా పనిచేస్తున్న జ్యోతి తల్లి….రిటైర్మెంట్ తర్వాత వచ్చిన నగదుపై కన్నేశాడు ప్రశాంత్. తల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలని తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. భర్త మాట వినకపోవడంతో …ఐరన్ బాక్స్ తో శరీరంపై వాతలు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. భర్త వేధింపులపై జ్యోతి కుటుంబ సభ్యులు లంగర్ హౌజ్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో భర్త ప్రశాంత్, అతని అన్నయ్య, అత్తలపై హత్యాయత్నం, వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates