మొఘల్ గార్డెన్స్ ను పరిశీలించిన రాష్ట్రపతి

KOVIND MOGHAL GARDENరాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్స్ ను విజిట్ చేశారు ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్. గార్డెన్స్ లోని పూల చెట్లను పరిశీలించారు. సతీమణి సవితా కోవింద్ తో కలిసి కలియదిరిగారు రాష్ట్రపతి. అక్కడక్కడ ఫొటోలు దిగారు. గార్డెన్స్ విశేషాలను ప్రెసిడెంట్ దంపతులకు వివరించారు అధికారులు. సంవత్సరంలో ఓ నెల రోజులపాటు మొఘల్ గార్డెన్స్ లోకి సందర్శకులను అనుమతిస్తారు. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 9 వరకు సందర్శకులను అలో చేయనున్నారు. 300 ఎకరాలున్న రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో 15 ఎకరాల్లో ఉంటేంది మొఘల్ గార్డెన్. ఇందులో మొత్తం 5 వేల చెట్లున్నాయి. 160 రకాల పూల మొక్కలు సందర్శకులను కనువిందు చేస్తాయి. మొఘల్స్ సంప్రదాయం… ఆ తర్వాత పాలించిన బ్రిటీష్ పద్ధతుల సమ్మేళనమే గార్డెన్స్. గత పదేళ్లలో 48 లక్షల మంది మొఘల్ గార్డెన్ ను సందర్శించారు. సోమవారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజిటింగ్ టైమ్స్. రైతులు, వికలాంగులు, పోలీసులు, రక్షణ శాఖ అధికారుల కోసం ప్రత్యేకంగా మార్చి 20 వ తేదీని కేటాయించారు. రాష్ట్రపతి భవన్లో స్పిరిచువల్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, బొన్సాయ్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్ అని వేర్వేరుగా ఉంటాయి.

వందల రకాల పూల మొక్కలు, ఔషధ మొక్కలు, పండ్ల చెట్లతో ఉద్యానవనం ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా బల్బ్ ఆకారపు పూల మొక్కలను ఏర్పాటు చేశారు. వింటర్ సీజన్లో వికసించే రానున్ క్లస్, ట్యూలిప్స్ ఫ్లవర్స్ ఆకర్షిస్తున్నాయి. 8 రకాల విభిన్న రంగుల్లో 10 వేల ట్యూలిప్ మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ఈ మొక్కలు ఫిబ్రవరి చివరి వారం వరకు విరబూస్తాయి. నెదర్లాండ్స్ నుండి ఈ టూలిప్స్ మొక్కలను ప్రత్యేకంగా తెప్పించి నాటారు. అబ్బురపరిచే అనేక రకాల గులాబీలు, సంప్రదాయ, కొత్త రకాల గులాబీ మొక్కల మడులు, మొగల్ గార్డెన్ పై భాగంలో కనువిందు చేస్తున్నాయి. సెంట్రల్ లాన్లో తోటమాలుల నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పూల తివాచీలు ఆకట్టుకుంటున్నాయి.

Posted in Uncategorized

Latest Updates