మొత్తం మార్చేస్తాం : ఎలక్ట్రిక్ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ

KTR BUSపర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా GHMC ముందుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం (జూన్-1) హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించారు మంత్రి. క్లీన్ సిటీగా దేశంలోనే హైదరాబాద్ కి నేషనల్ అవార్డ్ రావడంపై GHMC ని అభినందించారు కేటీఆర్. హైదరాబాద్ లో 3 వేల 800 ఆర్టీసీ బస్సులున్నాయని..వీటన్నింటినీ త్వరలోనే  దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామన్నారు. ప్రస్తుతం చెత్త సేకరణకు వాడుతున్న GHMC  వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పెంచేలా కృషి చేస్తామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. నగరంలో ఉండే నీటిబొట్టులను ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంతలను ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. MMTS రెండో దశను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సోలార్ ఉత్పత్తిలో భారత దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. నగరంలో 4 లక్షల LED లైట్లను ఆదునీకరించామన్నారు. దీంతో వీధులన్నీ కాంతివంతకావడంతో పాటు కరెంటు బిల్లులు తక్కువగా వచ్చిందని తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates