175 స్థానాలకు 3925 నామినేషన్లు : ద్వివేది

ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 3925 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల ప్రధాన అధికారి  గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో వివరాలు వెల్లడించారు. 25 లోక్ సభ స్థానాలకు 548 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3925 నామినేషన్లు వచ్చాయని చెప్పారు.  ఎంపీ స్థానాల్లో నంద్యాల ఎంపీకి అత్యధికంగా 38 నామినేషన్లు, చిత్తూరు ఎంపీకి అత్యల్పంగా 13 నామినేషన్లు వచ్చాయని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలో అత్యధికంగా నంద్యాలకు 61, అత్యల్పంగా పార్వతీ పురం, పాలకొండ నియోజకవర్గాలకు 10 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జనవరి 11 తర్వాత 25 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా 20,614 ఫిర్యాదులు అందాయని ఈసీ చెప్పారు.  అలాగే రాష్ట్రవ్యాప్తంగా 734 కేసులు నమోదయ్యాయని.. 12 కోట్ల 13 లక్షల ఖరీదైన బంగారం పట్టుకున్నట్లు చెప్పారు.

Latest Updates