మొదటి T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నసౌతాఫ్రికా

Virat-Aidenజోహెన్నెస్ బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా,భార‌త్ ల మధ్య జరుగుతున్న మొదటి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. . ఈ సిరీస్‌కు సౌతాఫ్రికా కెప్టెన్‌గా జేపీ డుమిని వ్యవహరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా టీమ్‌లోకి తిరిగొచ్చాడు. హార్దిక్ పాండ్యా కాకుండా ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో ఇండియా బరిలోకి దిగుతున్నది. కుల్‌దీప్‌ను పక్కన పెట్టి జయదేవ్ ఉనద్కట్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అయ్యర్ స్థానంలో మనీష్ పాండే టీమ్‌లోకి వచ్చాడు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 5-1తో గెలుచుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌పైనా కన్నేసింది.

Posted in Uncategorized

Latest Updates