మొదటి T20: టీమిండియా విజయం

team-indiaజోహ‌నెస్ బ‌ర్గ్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. 28 ప‌రుగుల తేడాతో స‌ఫారీల‌ను చిత్తు చేసింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ తో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో  5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ధావ‌న్ (72) ఆఫ్ సెంచరీ చేయగా.. రోహిత్ (21), రైనా(15), కోహ్లీ(26), పాండే (29), ధోని(16) పరుగులు చేశారు. తర్వాత 204 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాను భువ‌నేశ్వ‌ర్ దెబ్బ‌కొట్టాడు. నాలుగు ఓవ‌ర్లు వేసిన భువ‌నేశ్వ‌ర్ 24 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో స‌ఫారీలు 9 వికెట్లు న‌ష్టానికి 175 ప‌రుగులు మాత్ర‌మే చెయ‌గ‌లిగారు.

సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ల‌లో హెండ్రిక్స్(70) ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. పర్హాన్ (29) పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు అంతగా రాణించలేక పోయారు.

టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (5) వికెట్లు పడగొట్టగా.. పాండ్యా, చాహల్, జయదేవ్ ఉనాద్కట్  తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates