మొదలుకాక ముందే IPL రికార్డ్ లు స్టార్ట్ అయ్యాయి

iplఇండియన్ ప్రీమియర్‌లీగ్(IPL)  ప్రపంచవ్యాప్తంగా దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయంగా ఉన్న క్రికెట్ లీగ్‌లతో పోలిస్తే ఆదరణ, చూసేవాళ్లు , బ్రాండ్ పరంగా ఐపీఎల్ అగ్రస్థానంలో ఉంటుంది. ఐపీఎల్-11 సీజన్(2018) కోసం జనవరి నెలలో రెండు రోజుల పాటు బెంగళూరులో నిర్వహించిన వేలం ఇప్పటికే ఓ రికార్డ్ నమోదుచేయగా ఇప్పుడు మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకొంది ఐపీఎల్. అట్టహాసంగా ఆటగాళ్ల కోసం బెంగళూరులో నిర్వహించిన వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయగా 46.5 మిలియన్ల మంది ఈ వేలం పాటను చూసినట్లు సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా ఐదేళ్లపాటు లీగ్ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ తొలిసారి వేలాన్ని ప్రసారం చేసింది. ఈ వేలం కార్యక్రమాన్ని ఆరు ఛానెళ్లలో టెలికాస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates