మొదలైన దసరా రద్దీ.. కిక్కిరిసిన రైళ్లు, బస్సులు

దసరాకు సొంత ఊరికి వెళ్లి సరాదాగా గడుపుదామనుకునే వారికి ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు దసరా హాలిడేస్ రావడంతో.. సిటీ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. మంగళవారం (అక్టోబర్-9) హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు బయలుదేరిన బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.

ప్రస్తుత రద్దీకి అనుగుణంగా రవాణా సంస్థలు ఎక్స్ ట్రా దోపిడీకి తెరలేపాయి. స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఎక్స్ ట్రా చార్జీలను విధిస్తున్నట్లు RTC ముందే ప్రకటించగా..  ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణికుల డిమాండ్‌ మేరకు రెట్టింపు చార్జీలతో జేబులు గుల్ల చేస్తున్నాయి. రైల్వే మాత్రం ఇప్పటి వరకు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయలేదు. ఉన్న రెగ్యులర్‌ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. ఈ ఏడాది దసరా సందర్భంగా 4,480 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేపట్టింది. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌ నగర్‌ బస్టేషన్లతో పాటు కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్, ఎస్‌ఆర్‌నగర్, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు  బయలుదేరతాయి.

 

Posted in Uncategorized

Latest Updates