మోడల్ ప్రేమకథ : జైలు నుంచి వచ్చి ప్రేమను సాధించాడు

ప్రేమించిన అమ్మాయి కోసం జైలులో చిప్పకూడు తిన్నాడు. అయినాసరే ప్రేమ చావలేదు. శిక్ష అనంతరం బయటికి వచ్చిన ప్రియుడు ..డైరెక్ట్ గా తాను ప్రేమించిన అమ్మాయి ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో తన ప్రియురాలు మాత్రమే ఉంది. అదే ఛాన్స్ అనుకున్నాడు. లోపల డోర్ కి లాక్ వేశాడు. 12 గంటల పాటు బయటికి రాకుండా..చివరికి ప్రేమను పెందాడు..ప్రియురాలిని సొంతం చేసుకున్నాడు. అయితే ప్రియురాలు కోసం ఇంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చిందంటే ఆమె ఓ మోడల్ కావడమే.

వివరాల్లోకెళితే..భోపాల్‌ కు చెందిన 30 ఏళ్ల మోడల్‌, ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన రోహిత్‌ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ముంబైలో రోహిత్‌ మోడలింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. ప్రేమ విషయం తెలుసుకున్న మోడల్‌ తల్లిదండ్రులు రోహిత్‌ తో కూతురి పెళ్లికి నిరాకరించారు. దీంతో చేసేదేంలేక రోహిత్‌ పెళ్లికి వెనకడుగు వేశారు. ఈ విషయంలో రోహిత్‌ పై మోదల్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. అతడు కొంతకాలం జైలుశిక్ష అనుభవించి బయటకొచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు భోపాల్‌ లోని మిస్రాడ్‌ ఏరియాలోని మోడల్‌ అపార్ట్‌మెంట్‌కు శుక్రవారం (జూలై-13) ఉదయం 6గంటల ప్రాంతంలో వెళ్లాడు రోహిత్‌. ఐదో అంతస్తులో నివాసం ఉంటున్న మోడల్‌ ఇంట్లోకి ప్రవేశించి డోర్‌ లాక్‌ చేశాడు.

చుట్టుపక్కలవారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మోడల్‌ ను కాపాడాలని భావించారు. అయితే మోడల్‌, తాను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసులకు వీడియో కాల్‌ ద్వారా తెలిపారు రోహిత్‌. ఈ క్రమంలో 12 గంటలు గడిచిపోయాయి. పెళ్లి గురించి మరోసారి ఆరాతీయగా వివాహం చేసుకుంటానని ఆమె చెప్పారు. పెళ్లికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టాంప్‌ పేపర్‌ మీద సంతకాలు సేకరించాడు. ఇంట్లో నుంచి బయటకురాగానే రోహిత్‌తో పాటు మోడల్‌ను అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌ కు తరలించినట్లు తెలిపారు ఎస్పీ రాహుల్‌ లోధా తెలిపారు.

మోడల్‌(30), ఆమె ప్రియుడు రోహిత్‌(30)కి కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరూ మేజర్లనీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చునని సూచించామన్నారు. అవసరమైతే చట్టపరంగా వారికి సహకారం అందిస్తామని చెప్పినట్లు వివరించారు. అయితే ఆ సమయంలో నాటు తుపాకీతో ఆమెను ఏమైనా బెదిరించాడా అనే కోణంలోనూ రోహిత్‌ పై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. ఏదైతేనేం మొత్తానికి జైలు నుంచి వచ్చి, మోడల్ ప్రేమను పొందాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates