మోడీకి.. ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం : నా ప్రమాణ స్వీకారానికి రండి

పాకిస్ధాన్ ప్రధానిగా ఆగస్టు-11న ప్రమాణస్వీకారం చేయనున్నారు పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీని కూడా హాజరయ్యే అవకాశముంది. సార్క్ దేశాధినేతలను తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నట్లు పీటీఐ పార్టీ నేత మంగళవారం(జులై-31)  తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

జులై-25న జరిగిన పాకిస్ధాన్ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్ధానాలు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధానిగా భాధ్యతలు చేపట్టబోతున్న పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు.. భారత ప్రధాని మోదీ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌, భారత్‌ ద్వైపాక్షిక బంధంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ ఇమ్రాన్‌ ఖాన్‌ తో అన్నారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఇమ్రాన్ ఖాన్.

2014లో భారత ప్రధాని గా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలు హాజరైన విషయం తెలిసిందే. అప్పటి పాక్ ప్రధానిగా నవజ్ షరీఫ్ ఈ కార్యక్రమానికి హారయ్యారు. ఆ తర్వాత 2015, డిసెంబర్ లో షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా పాకిస్ధాన్ వెళ్లి షరీఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates