మోడీకి చెన్నై సెగ : యువకుడి ఆత్మహత్యతో తమిళనాడు భగ్గు

modiకావేరీ జలాల వివాదంపై తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఢిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించేందుకు ఈ రోజు(ఏప్రిల్-12) చెన్నై చేరుకున్నారు ప్రధాని మోడీ.  ప్రధాని మోడీకి నిరసనల సెగ తగిలింది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఎయిర్ పోర్టు దగ్గర ఆందోళనకారులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మోడీ చెన్నై పర్యటనను వ్యతిరేకిస్తూ ధర్మలింగం అనే ఓ యువకుడు ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. కావేరి వివాదంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరాశకు లోనయ్యానంటూ, మోదీ పర్యటన వ్యతిరేకిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అతడు చనిపోయాడు. తమిళ సంఘాల నిరసనలతో ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఎస్‌ పీజీకి అదనంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates